ప్రపంచాన్ని రక్షించిన బాండ్‌!

ఓ భయంకర ఉపగ్రహం ప్రపంచానికే సవాలు విసిరింది. దాని ద్వారా భూమ్మీద ఏ ప్రాంతం మీద కైనా ఎలక్టోమ్య్రాగ్నటిక్‌ కిరణాలను తీక్షణంగా ప్రసరింపజేసి భస్మీపటలం చేయవచ్చు. ఆ ఉపగ్రహాన్ని నియంత్రించే కోడ్‌ ఓ దుండగుడికి దొరికింది. దాంతో అతగాడు ప్రతి దేశాన్ని బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ ఉపద్రవాన్ని నివారించి ఆ ద ుంగడికి ఆటకట్టించేదెవరు? ఇంకెవరు జేమ్స్‌బాండే! అందుకే అతగాడు పదిహేడోసారి వెండితెరపైకి దూకాడు. బాండ్‌ పాత్రలో పియర్స్‌ బ్రాస్నన్‌ తొలిసారిగా విజృంభించి ఆకట్టుకున్నాడు. బాండ్‌ సృష్టికర్త ఇయాన్‌ ఫ్లెమింగ్‌ నవలలోని అంశాలను ఉపయోగించకుండా సరికొత్తగా కథ అల్లుకున్న తొలి బాండ్‌ సినిమా ఇది. ఇందులో బాండ్‌ బాస్‌గా కనిపించే తొలి మహిళగా జుడీడెంచ్‌ నటించింది. సుమారు 60 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తెరకెక్కిన చిత్రం ‘గోల్డెన్‌ ఐ’. ఈ సినిమా 1995 నవంబర్‌ 13న విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 355 మిలియన్‌ డాలర్లు కురిపించింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.