హ్యారీపాటర్‌ హాంఫట్‌!

హ్యారీపాటర్‌... పరిచయం అక్కర్లేని పేరు. అటు సాహిత్య అభిమానులకైనా, ఇటు సినీ అభిమానులకైనా ఇష్టమైన పేరు. బ్రిటిష్‌ రచయిత్రి జేకే రౌలింగ్‌ సృష్టించిన ఈ పాత్ర నవలల ద్వారా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే, ఆ నవలల వెండితెర రూపాలైన సినిమాలు కాసులు కురిపించి విజయవిహారం చేశాయి. ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద ఫిలాసఫర్స్‌ స్టోన్‌’ పేరుతో 1997లో విడుదలైన తొలి నవల ఆధారంగా వార్నర్‌ బ్రదర్స్‌ పిక్చర్స్‌ అందించిన సినిమా 2001 నవంబర్‌ 4న విడుదలై దేశదేశాల్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. సుమారు 125 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా 974 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతో మొదలైన హ్యారీపాటర్‌ సీక్వెల్‌ సినిమాలు 2011 వరకు పదేళ్ల పాటు కొనసాగాయి. ఇవన్నీ కలిసి 7.7 బిలియన్‌ డాలర్లను కురిపించడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.