మొట్టమొదటి సినిమాస్కోప్‌ చిత్రం!
లన చిత్ర చరిత్రలో ‘సినిమాస్కోప్‌’ ఓ సంచలనమే. ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచిన ఈ సాంకేతిక ప్రక్రియ విపరీతంగా ఆకర్షించింది. దీనికి సంబంధించి రెండు సినిమాలను చెప్పుకోవాలి. తొలిసారిగా సినిమాస్కోప్‌ విధానంలో తెరకెక్కిన సినిమాగా ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్‌’ గుర్తింపు పొందింది. అయితే దీని తర్వాత సినిమాస్కోప్‌ పద్ధతిలో తీసిన ‘ద రోబ్‌’ మొదట విడుదలైంది.


‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్‌’ (1953) విషయానికి వస్తే అందాల తారలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మార్లిన్‌ మన్రో, బెట్టీ గ్రాబుల్, లారెన్‌ బకాల్‌ నటించిన సినిమా ఇది. అప్పట్లోనే 1.87 మిలియన్‌ డాలర్ల (ఇప్పటి లెక్కల్లో 18 మిలియన్‌ డాలర్లు)తో తీసిన ఈ సినిమా, 8 మిలియన్‌ డాలర్లు (ఇప్పటి లెక్కల ప్రకారం 76 మిలియన్‌ డాలర్లు) కురిపించింది.' ముగ్గురు అందగత్తెలతో పాటు కథ కూడా ఆసక్తికరమే. న్యూయార్క్‌లో ముగ్గురు అందాల భామలు మోడల్స్‌గా పనిచేస్తుంటారు. డబ్బు అంతంతమాత్రంగా ఉన్న వీళ్లు ముగ్గురూ కలసి ఓ పథకం వేసుకుంటారు. ముగ్గురు ధనవంతులను చూసి వారిని ప్రేమలోకి దించి పెళ్లి చేసుకోవాలనేదే వాళ్ల పథకం. అందుకోసం ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్లోకి అద్దెకు దిగుతారు. అందులో ఉండే సంపన్న బ్రహ్మచారులపై కన్నేస్తారు. మరి ఆ ముగ్గురి కలలూ నెరవేరాయా? వాళ్లు కోరుకున్న సంపన్నులు దొరికారా? వాళ్లు వీరి ప్రేమ వలలో పడ్డారా? అనేదే కథ. చివరకి ఈ ముగ్గురూ తమ ప్రయత్నాలలో నిజమైన ప్రేమంటే ఏంటో తెలుసుకోవడమే కొసమెరుపు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.