ఈ ‘జోకర్‌’ విలువ ఆరువేల కోట్లు!

విడుదలకు ముందే కొన్ని చిత్రాలపై భారీ అంచనాలుండటం సహజం. వాటిలో కొన్ని మాత్రమే ఆ అంచనాలను అందుకుంటాయి. తాజాగా ‘జోకర్‌’ చిత్రం ఆ అంచనాలని కూడా దాటుకొని విజయం సాధించింది. ప్రస్తుతం ఇది ప్రపంచ వ్యాప్తంగా ఆరు వేల కోట్ల వసూళ్లు సాధించి ప్రపంచ రికార్డు దిశగా వెళుతున్నట్టు ఫోర్బ్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు విడుదలైన హాస్య నేపథ్యం ఉన్న చిత్రాల్లో ‘జోకర్‌’ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలో జోక్విన్‌ ఫొనిక్స్‌ నటనతో పాటుగా హాస్యం, భావోద్వేగాలు ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్‌ 2న విడుదలైన ఈ చిత్రం భారత్‌లో ‘వార్‌’, ‘సైరా’ చిత్రాలకు దీటుగా నిలబడి మల్టిప్లెక్స్‌ థియేటర్లలో 50 కోట్లు వసూళ్లు చేయటం మరో విశేషం. ఈ చిత్రానికి టాడ్‌ ఫిలిప్స్‌ దర్శకత్వం వహించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.