బాలీవుడ్‌లో చిత్రాల్లో డికాప్రియో!

అం
తర్జాతీయ నటుడు, ఆస్కార్‌ విజేత లియోనార్డ్‌ డికాప్రియో పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్చొచ్చే చిత్రం ‘టైటానిక్‌’. ఆ చిత్రంలో కేట్‌విన్‌స్లెట్‌ - డికాప్రియోల రొమాంటిక్‌ ప్రేమకథ ప్రతి ప్రేమికులను ఆకట్టుకుంది. తాజాగా లియోనార్డ్‌ ఇండియాకి చెందిన సినీ వ్యాపారవేత్త అయిన రష్మీకాంత్‌ కామ్దార్‌లు ఓ పార్టీలో కలుసుకున్నారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య సినిమాల గురించి ప్రస్తావన వచ్చింది. ‘‘బాలీవుడ్‌ చిత్రాల్లో నటించాలని ఉంద’’ని డికాప్రియో చెప్పగా.. అందుకు స్పందించిన రష్మీకాంత్‌..‘‘మీతో కలిసి సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నామ’’ని చెప్పారు. ‘íన్‌’ స్టూడియో అధినేత జయంతి లాల్‌ గడా నిర్మించే చిత్రంలో లియోనార్డ్‌ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని కామ్దార్‌ చెప్పారు. లియోనార్డ్‌ గత ఏడాది క్వెంటిన్‌ టరాన్టిటో దర్శకత్వంలో వచ్చిన ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’ చిత్రం విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకొంది. ఈ చిత్రాన్ని ఇండియాలో ఫిబ్రవరి 14, 2020న విడుదల చేయనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.