‘పెద్దల’ కథకి మూడు ఆస్కార్లు!
ఆ సినిమా ‘పెద్దలకు మాత్రమే’ తీసిన ‘ఎక్స్‌’ రేటెడ్‌ చిత్రం!
ఇద్దరు పురుషుల అనుబంధంతో కూడిన చిత్రం!
శృంగారం చుట్టూ అల్లుకున్న కథాంశం!
అయితేనేం?
అది మూడు ఆస్కార్‌ అవార్డులను అందుకుంది!
పెద్దల కథతో ఉత్తమ చిత్రంగా నిలిచిన తొలి సినిమాగా గుర్తింపు పొందింది!
ఆస్కార్‌ అందుకున్న తొలి ‘ఎల్‌జీబీటీ’ (లెస్బియాన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్‌) సినిమాగా నిలిచింది!
100 మేటి సినిమాల జాబితాలో స్థానం సాధించింది!
అమెరికా జాతీయ చలనచిత్ర గ్రంథాలయంలోకి చేరింది!
ఇన్ని విశేషాలున్న ఆ సినిమానే ‘మిడ్‌నైట్‌ కౌబాయ్‌’ (1969).
అమెరికా రచయిత జేమ్స్‌ లియో హెర్లిహై 1965లో రాసిన నవల ఆధారంగా అదే పేరుతో దీన్ని తెరకెక్కించారు.


పాధి కోసం న్యూయార్క్‌ చేరిన ఇద్దరు యువకులు ఎలాంటి మార్గాల్లో ప్రయాణించారనేదే కథ. వారిలో ఒకరు పురుష వ్యభిచారిగా మారితే, మరొకరు గారడీలతో ఇతరులను మోసం చేస్తుంటాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. దీన్ని 3.2 మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీస్తే 44.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేయడమే కాకుండా మూడు ఆస్కార్లు, ఒక గోల్డెన్‌గ్లోబ్, ఆరు బ్రిటిష్‌ అకాడమీ, ఇంకా పలు ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.