అంతరిక్షంలో గూఢచారి పోరాటం..
‘ఈ భూమ్మీద మనుషులందరినీ తుడిచిపెట్టేయాలి. మళ్లీ కొత్తగా కొత్త సృష్టి చేయాలి...’ - జేమ్స్‌బాండ్‌ సినిమాల్లో విలన్ల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అందుకోసం కావాలంటే వాళ్లు అంతరిక్ష నౌకల్ని కూడా దొంగతనం చేస్తారు. దుష్టతలంపుల్ని రోదసి మార్గం పట్టిస్తారు. ఇలాంటి వాళ్ల పని పట్టాలంటే బ్రిటిష్‌ గూఢచారి జేమ్స్‌బాండ్‌ 007కే సాధ్యం. ఈ మొత్తం కలిపితే

‘మూన్‌రేకర్‌’ సినిమా. బాండ్‌ సినిమాలో 11వ చిత్రం ఇది. బాండ్‌గా రోజర్‌మూర్‌కి నాలుగోది. చిత్రమేమంటే బాండ్‌ పాత్రని సృష్టించి రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ ఈ నవల పూర్తవకుండానే ఇది సినిమాగా రావాలని

కోరుకున్నాడు. అందుకు తగినట్టుగానే పకడ్బందీగా స్కీన్ర్‌ప్లే తరహాలో 1954లోనే నవలను రాశాడు. అతడి కలను నెరవేరుస్తూ ఈ సినిమా 1979లో ఇదే రోజు లండన్‌లో తొలి ప్రదర్శనతో మొదలైంది. అప్పటి వరకు తీసిన బాండ్‌ సినిమాల్లోనే అత్యధిక వ్యయం 34 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ప్రపంచ వ్యాపంగా ఏకంగా 210 మిలియన్‌ డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.