ఆస్కార్‌ అందుకున్న క్లాసిక్‌

అప్పట్లో ఆ సినిమా అతి పెద్ద విజయం సాధించిదిగా గుర్తింపు పొందింది. ఓ క్లాసిక్‌ చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలతో పాటు, ఆస్కార్‌ లాంటి ఎన్నో అవార్డులు అందుకుంది. అదే ‘మ్యూటినీ ఆన్‌ ద బౌంటీ’ (1935). ఆస్కార్‌ అవార్డుల వ్యవస్థాపకుల్లో ఒకడైన ఫ్రాంక్‌ లాయిడ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘కింగ్‌ ఆఫ్‌ హాలీవుడ్‌’గా పేరొందిన క్లార్క్‌ గేబుల్‌ ప్రధాన పాత్రలో నటించాడు. అమెరికా నవలా రచయితలు చార్లెస్‌ నార్డ్‌హాఫ్, జేమ్స్‌ నార్మన్‌ హాల్‌ 1932లో రాసిన నవల ఆధారంగా దీనిని తీశారు. బౌంటీ అనే 1789నాటి ఓడలో జరిగిన తిరగుబాటు ఆధారంగా వాస్తవిక సంఘటనల నేపథ్యంలో వాళ్లు ఈ నవలను రాశారు. ఈ నవల విపరీతంగా ఆకట్టుకోవడంతో ‘మెన్‌ ఎగైనెస్ట్‌ ద సీ’, ‘పిట్‌కార్న్‌ ఐలాండ్‌’ అనే మరో రెండు నవలలు వెలువడ్డాయి. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ నవలలలోని అంశాలను అద్భుతంగా చిత్రీకరించారనే ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. ‘వందేళ్లు వంద మేటి సినిమాలు’ జాబితాలో దీనికి స్థానం లభించిందిCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.