దోపిడీ దొంగల హంగామా!

దోపిడీల కథలు î ెండితెరకు పసందైన సరుకే. వీటి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చి విజయవంతమయ్యాయి. బాలీవుడ్‌లో ‘థూమ్‌’ సీక్వెల్‌ సినిమాలు సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇలాంటి సినిమాలకు హాలీవుడ్‌ ఎప్పుడో తెర తీసింది. అలా వచ్చిన వాటిలో ఒకటి ‘ఓషన్స్‌ ఎలెవన్‌’ (2001). ఇందులో ప్రముఖ నటులు బ్రాడ్‌పిట్, జార్జి క్లూనీ, మట్‌ డామన్, జులియా రాబర్ట్స్‌లాంటి మహామహులు నటించారు. ఈ సినిమా 85 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 450 మిలియన్‌ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమా విజయంతో దీనికి కొనసాగింపుగా ‘ఓషన్స్‌ ట్వెల్వ్‌’ (2004), ‘ఓషన్స్‌ థర్టీన్‌’ (2007) సినిమాలు కూడా వచ్చాయి. అంతేకాదు, మహిళలే దోపిడీలు చేసే కథాంశంతో 2018లో ‘ఓషన్స్‌ 8’ సినిమా కూడా రావడం విశేషం. ఇంతకీ ‘ఓషన్స్‌ ఎలెన్‌’ కథేంటి? నిజానికి ఇది 1960లో ఇదే పేరుతో వచ్చిన సినిమాకు రీమేక్‌. డేనీ ఓషన్‌ అనే ఓ నేరస్థుడు పేరోల్‌ మీద బయటకి వచ్చి పోలీసుల కళ్లుగప్పి పారిపోయి తన స్నేహితులైన పాత నేరస్థులను కలుపుకుని 11 మంది బృందంగా ఏర్పడి లాస్ గాస్‌లో ఉండే అత్యంత విలాసవంతమైన మూడు జూదగృహాలను ఒకేసారి దోచుకోవడం కథాంశం. ఇలా దోచుకోడానికి వాళ్లు వ్యూహాలు, ఆటంకాలను ఎదర్కొనే పథకాలతో ఈ సినిమాల సీక్వెల్స్‌ అన్నీ కలిపి 350 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 1.4 బిలియన్‌ డాలర్లకు పైగా కాసులు కురిపించి సంచలనం సృష్టించాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.