ఆస్కార్ అకాడమీ కొత్త చరిత్రకు నాంది పలుకుతున్నట్లే ఉంది. హారర్, డార్క్ ఫాంటసీ చిత్రాలను అకాడమీ పురస్కారాలతో సత్కరించడానికి అకాడమీ సిద్ధపడటం మాలాంటి నిర్మాత దర్శకులకు ఆనందం కలిగిస్తోంది’ అంటున్నాడు గైలెర్మో డెల్ టోరో. ఆయన దర్శకత్వం వహించిన డార్క్ ఫాంటసీ చిత్రం ‘ది షేప్ ఆఫ్ వాటర్’కు ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల నామినేషన్లలో మొత్తం 13 నామినేషన్లు లభించాయి. అలాగే, ఇదే జోనర్‌కు చెందిన ‘గెట్ అవుట్’ చిత్రానికి నాలుగు నామినేషన్లు లభించాయి. ఈ రెండు చిత్రాలూ ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే వంటి విభాగాలలో పోటీపడుతున్నాయి. శాలీ హాకిన్స్, మైకేల్ షానన్, రిఛర్డ్ జెంకిన్స్, డాంగ్ జోన్స్, ఆక్టేవియా స్పెన్సర్వంటి నటీనటులు ఉన్న ‘ది షేప్ ఆఫ్ వాటర్’ చిత్రం వెనిస్ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో అనేక పురస్కారాలు అందుకుంది.