ఆస్కార్‌ వేడుక జరిగేది 2021లోనే?


కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయంగా అన్నీ రకాల సినిమాలు తమ విడుదల తేదీని మార్చుకున్నాయి. అంతేకాదు ఎంతో గొప్పగా జరిగే ఆస్కార్‌ అవార్డుల ఉత్సవం కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే . అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్ అండ్‌ సైన్స్ స్‌ ఆస్కార్‌ 2021కి వాయిదా వేలయాలని నిర్ణయించారట. ప్రస్తుతానికి 93వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 28, 2021న జరగనుంది. అయితే తాజాగా ఆస్కార్‌ వేడుకను వేరే తేదీలకు కూడా మార్చవచ్చుని కూడా హాలీవుడ్‌ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే అధికారికంగా ఇంకా నిర్దారణ కాలేదు. ఇప్పటికే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్ అండ్‌ సైన్సెస్‌ ఆస్కార్‌ ఎంట్రీలో మార్చులు చేసింది. అయితే ఇది శాశ్వత మార్పు కాదని కూడా చెబుతోంది. ఇప్పటికే సౌండ్ మిక్సింగ్‌ - సౌండ్‌ ఎడిటింగ్‌ ఒక అవార్డు కింద కలిపేశారు. అకాడమీ అద్యక్షుడు డేవిడ్‌ రూబిన్‌ మాట్లాడుతూ..‘‘మహమ్మారి కరోనా మా ప్రణాళికలన్నింటిని చాలా మార్చేసింది. అయితే ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుందో మాత్రం తెలుసుకోవడం అసాధ్యం. మేం ఘనంగా ఈ చిత్రోత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాం.  అది ఎలా అన్నది తెలియడం లేదని’’ చెప్పారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కారణంగా భారీ బడ్జెట్‌ చిత్రాలైన ‘నో టైమ్‌ టు డై’ జేమ్స్ బాండ్‌ చిత్రం మొదలుకొని ‘గన్‌మావెరిక్‌’, ‘ములన్‌’, మార్వెల్‌ సంస్థకు చెందిన ‘బ్లాక్‌ విడో’లాంటి చిత్రాలు ఉన్నాయి.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.