హలో మైడియర్‌ రాంగ్‌ నెంబర్‌...

ఇప్పుడంటే సెల్‌ఫోన్లు వచ్చేసి కమ్యూనికేషన్‌ను చాలా సులభతరం చేశాయి కానీ, ఇవేమీ లేని రోజుల్లో టెలిఫోన్‌లే గతి. అవి కూడా అందరికీ లేని కాలంలో, ఒకే కనెక్షన్‌ను కొందరు కలసి వాడుకోవలసిన సమయంలోని కథతో ఓ సినిమా వచ్చింది. అదే ‘పిల్లో టాక్‌’ (1959). కేవలం ఫోన్‌లో మాత్రమే పరిచయమై ప్రేమించుకోవడమనే అంశాలపై అన్ని భాషల్లోను సినిమాలు వచ్చాయి. అలాంటిదే ఇది. ఓ అందమైన ఇంటీరియర్‌ డెకరేటర్, ఓ హుషారైన బ్రహ్మచారిలకు కలిపి ఒకే టెలిఫోన్‌ లైన్‌ ఇస్తారు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడు ట్రై చేసినా లైన్‌ బిజీగానే ఉంటుంది. కారణం ఆ బ్రహ్మచారి ఎప్పుడూ ఫోన్‌లో అమ్మాయిలతో మాట్లాడుతూ పాటలు కూడా పాడుతూ ఉంటాడు. దీంతో విసిగిపోయిన ఆ అమ్మాయి అతడిపై ఫిర్యాదు చేస్తుంది. ఆ సంగతి తెలుసుకున్న అతడు ఆమెకు ఫోన్‌లోనే వేరే వ్యక్తిగా గొంతు మార్చి పరిచయమై, ఆమెను ప్రేమలోకి దించడమే కథ. రొమాంటిక్‌ కామెడీగా మలచిన ఈ సినిమా అప్పట్లో ఆకట్టుకుని రూపాయికి ఏడు రూపాయలు సంపాదించడంతో పాటు ఆస్కార్‌ అవార్డు కూడా సాధించింది. అందాల తార డోరిస్‌ డే, నటుడు రాక్‌ హడ్సన్‌ కలిసి నటించి తొలి సినిమా ఇది. ఈ సినిమా విజయవంతం అవడం వల్ల వారిద్దరితో మరికొన్ని రొమాంటిక్‌ సినిమాలు వచ్చాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.