కాసులు కురిపించిన కత్తి యుద్ధాలు

యాక్షన్‌ సినిమాల్లో కత్తి యుద్ధాలు, సాహసాలతో కూడిన వాటిని ‘స్వాష్‌బక్లర్‌’ సినిమాలంటారు. ఆ విభాగానికి చెందినవే ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరిబియాన్‌’ సినిమాలు. ఈ పేరు వినగానే సినీ అభిమానులకు 5 సినిమాలు కళ్ల ముందు కదులుతాయి. జానీడెప్, ఓర్లాండో బ్లూమ్, అందాల తార కియారా నైట్‌లీ నటించిన ఈ సినిమాలన్నీ ప్రేక్షకులను అద్భుత ఊహాలోకాల్లోకి తీసుకుపోయి ఉత్కంఠ కలిగించి, వినోదాన్ని అందించాయి. వీటన్నింటినీ 1.274 బిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే, ఇవన్నీ కలిసి 4.56 బిలియన్‌ డాలర్ల వసూళ్లను కురిపించాయి. ఈ సినిమాల పరంపరలో మూడోదిగా వచ్చిన ‘పైరేట్స్‌ ఆఫ్‌ ద కరిబియాన్‌: ఎట్‌ వరల్డ్స్‌ ఎండ్‌’ సినిమా 2007లో విడుదలైంది. దీన్ని 300 మిలియన్‌ డాలర్లతో తీస్తే ఏకంగా 963.4 మిలియన్‌ డాలర్లు వచ్చిపడ్డాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.