నిధి కోసం అన్వేషణ

గొప్ప దర్శకుడు, ఓ సంచలన నిర్మాత, ఓ గొప్ప నటుడు కలిసిన సినిమాగా ‘రైడర్స్‌ ఆఫ్‌ ద లాస్ట్‌ ఆర్క్‌’ సినిమాను చెప్పుకోవచ్చు. ‘స్టార్‌వార్స్‌’ లాంటి సినిమాను అందించిన జార్జిలూకాస్‌ నిర్మాణంలో, ‘జాస్‌’, ‘ఇటి’ లాంటి సినిమాలను రూపొందించిన స్పీల్‌బర్గ్‌ దర్శకత్వంలో, ఆరు దశాబ్దాల పాటు హాలీవుడ్‌ నటుడిగా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హారిసన్‌ ఫోర్డ్‌ కథానాయకుడిగా వచ్చిన ఈ సినిమా ‘ఇండియానా జోన్స్‌’ ట్రయాలజీలో మొదటిది. నిధి కోసం సాగించే అన్వేషించే కథతో ప్రపంచ గొప్ప సినిమాల్లో ఒకటిగా పేరొందిన ఇది అయిదు ఆస్కార్‌ అవార్డులు సాధించింది. 18 మిలియన్‌ డాలర్లతో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 384 మిలియన్‌ డాలర్లు రాబట్టింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.