దారి తప్పిన యువత కథ!

తల్లితండ్రుల వ్యవహార శైలి... మధ్య తరగతి యువత అయోమయం... తరాల మధ్య పెరుగుతున్న అంతరాలు... వీటి నేపథ్యంలో కథను అల్లుకుంటే సమాజానికి అద్దం పట్టినట్టే. ‘రెబెల్‌ వితౌట్‌ ఎ కాజ్‌’ అలాంటి సినిమానే. సమాజంలో వస్తున్న మార్పుల్ని నిశితంగా గమనించిన ఓ సైకియాట్రిస్ట్‌ రాబర్ట్‌ ఎమ్‌.లిండ్నర్‌ 1944లో రాసిన ‘రెబల్‌ వితౌట్‌ ఎ కాజ్‌: ద హైపో ఎనాలసిస్‌ ఆఫ్‌ ఎ క్రిమినల్‌ సైకోపాత్‌’ అనే పుస్తకం ఆధారంగా నికోలాస్‌ రే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వార్నర్‌ బ్రదర్స్‌ బ్యానర్‌పై 1955 అక్టోబర్‌ 27న విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. అసంతృప్తితో రగిలిపోతున్న యువతరం ప్రతినిధిగా ఇందులో కీలక పాత్రలో నటించిన జేమ్స్‌డీన్‌ను రాత్రికి రాత్రి స్టార్‌ చేసిందీ చిత్రం. ఈ చిత్రాన్ని అమెరికా ప్రభుత్వం భద్రపరిచింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.