ఒక రూపాయికి... 225 రూపాయలు!
ఓ సినిమా...

- నిర్మాణ వ్యయానికి 225 రెట్లు ఆర్జించింది...

- ఆ సినిమా నటుడిని సూపర్‌స్టార్‌ని చేసేసింది...

- ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది...

- మూడు ఆస్కార్‌ అవార్డులు అందుకుంది...

- మరో ఆరు కొనసాగింపు సినిమాలకు నాంది పలికింది...

                               


ఇన్ని ఘనతలు సాధించిన ఆ సినిమా ‘రాకీ’. సిల్వస్టర్‌ స్టాలోన్‌ కథ రాసి, కీలక పాత్రలో నటించిన ఈ సినిమా 1976లో విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం ఒక మిలియన్‌ డాలర్ల ఖర్చుతో తీసిన ఈ సినిమా 225 మిలియన్‌ డాలర్లను ఆర్జించింది. క్రీడల నేపథ్యంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. దీని తర్వాత ఆరు కొనసాగింపు సినిమాలు వచ్చి అన్నీ కాసుల వర్షం కురిపించాయి. వీటిలో అయిదింటిని సిల్వస్టర్‌ స్టాలోనే రాశాడు. నాలుగింటికి తనే దర్శకత్వం వహించాడు. ఈ అన్ని సినిమాల్లో తానే రాకీగా నటించాడు. ఓ వడ్డీ వ్యాపారి దగ్గర బాకీలు వసూలు చేసే ఓ యువకుడు అనుకోని అవకాశం వచ్చి, ఆరు వారాల వ్యవధిలో ప్రపంచ హెవీవెయిట్‌ ఛాంపియన్‌గా ఎలా మారాడనేదే కథ. సిల్వస్టర్‌ స్టాలోన్‌ టీవీలో మహమ్మద్‌ ఆలీ బాక్సింగ్‌ పోటీని చూసి స్ఫూర్తి పొంది కేవలం మూడు రోజుల్లో ఈ సినిమా కథను రాశాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.