ఆకుపచ్చ రాక్షసుడి కథ

‘ష్రెక్‌’ ఎవరో తెలుసా? అని ఏ పిల్లల్నయినా అడిగి చూడండి. ఆ పేరుతో వచ్చిన సినిమాలు, టీవీ సీరియల్స్‌ జాబితా చెబుతారు. అంతగా ప్రాచుర్యం పొందిన పాత్ర ‘ష్రెక్‌’. అమెరికన్‌ కార్టూనిస్టు, రచయిత అయిన విలియం స్టీగ్‌ రాసిన పిల్లల బొమ్మల నవల ఇది. ఈ నవల ఆధారంగా తీసిన యానిమేషన్‌ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్నాయి. ఈ పాత్రతో ష్రెక్‌ (2001), ష్రెక్‌2 (2004), ష్రెక్‌ ద థర్డ్‌ (2007), ష్రెక్‌ ఫరెవర్‌ ఆఫ్టర్‌ (2010) సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కలిసి ప్రపంచవ్యాప్తంగా 295 కోట్ల డాలర్లను వసూలు చేయడం విశేషం. వీటిలో నాలుగో సినిమా 2010 ఏప్రిల్‌ 21న విడుదలై పిల్లల్ని, పెద్దల్ని కూడా ఆకట్టుకుంది. 135 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా ఏకంగా 752.6 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.