ఆకుపచ్చ రాక్షసుడి హంగామా!

భారీ శరీరం... ఆకుపచ్చని రంగు... పొడుచుకొచ్చిన ఆకుల్లాంటి చెవులు... ఈ ఆకారాన్ని వర్ణిస్తే చాలు, సినీ అభిమానులు ‘ష్రెక్‌’ అని పోల్చుకుంటారు. అంతలా ఈ పాత్ర ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్ని, పెద్దల్ని ఆకర్షించింది. అమెరికాకు చెందిన కార్టూనిస్టు, పిల్లల కథల రచయిత, శిల్పకారుడు అయిన విలియం స్టీగ్‌ 1990లో రాసిన ‘ష్రెక్‌’ అనే నవల ఆధారంగా కంప్యూటర్‌ యానిమేషన్‌ విధానంలో నాలుగు సినిమాలు వెండితెరకు ఎక్కి ఆకట్టుకున్నాయి. మొదటిది 2001లో రాగా, మిగతావి 2004, 2007, 2010లో వచ్చాయి. ఇవి కాక రెండు టీవీ ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఈ చిత్రాల పరంపరలో ‘ష్రెక్‌ ద థర్డ్‌కైండ్‌’ సినిమా 2007 మే 6న విడుదలై, 160 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 799 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.