వాన హోరులో పాటల జల్లు

చా
లా ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో రెయిన్‌ డాన్స్‌లొక ప్రత్యేకత. హోరెత్తించే పాటల నేపథ్యంలో ఏర్పాటు కృత్రిమ జల్లుల్లో యువతీ యువకులు మైమరిచిపోతూ డ్యాన్స్‌లు చేస్తుంటారు. అలా అటు వర్షం, ఇటు పాటలతో ఉర్రూతలూగించిన ఓ సినిమా 1927లోనే వచ్చిందని తెలుసా? అదే ‘సింగింగ్‌ ఇన్‌ ద రెయిన్‌’. అందాల భామలు, వాళ్ల నృత్యాల నేపథ్యంలో అల్లుకున్న ఓ సంగీత భరితమైన ప్రేమ కథ ఇది. మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ సినిమాగా వచ్చిన ఈ సినిమాను అప్పట్లో 2.5 మిలియన్‌ డాలర్ల వ్యయంతో చిత్రీకరిస్తే, 12.4 మిలియన్‌ డాలర్లను వసూలు చేయడంతో పాటు అనేక అవార్డులు పొందింది. ప్రముఖ డ్యాన్సర్‌గా, నటుడిగా, దర్శక నిర్మాతగా పేరొందిన జెనీ కెల్లీ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు, కొరియోగ్రాఫర్‌గా కూడా నృత్యాలు సమకూర్చాడు. అందాల తారలు నటి డెబ్బీ రెనాల్డ్స్, జీన్‌ హాగెన్‌ నటుడు డొనాల్డ్‌ ఓకోనర్‌ తదితరులు నటించిన ఈ సినిమాలో అడుగడుగునా పాటలు, డ్యాన్స్‌లు ప్రపంచ సినీ అభిమానులను హుషారెత్తించాయి. మేటి మ్యూజికల్‌ ఫిల్మ్‌గా ఇది ప్రశంసలు పొందింది. పద్నాలుగేళ్ల వయసు వచ్చేసరికల్లా ప్రతి ఒక్కరూ చూసి చూడాల్సిన 50 సినిమాల జాబితాలో ఒకటిగా నిలిచింది. ‘వందేళ్లు...వంద మేటి సినిమాలు’ పేరిట వచ్చే జాబితాల్లో ఇది చోటు సంపాదించుకుంది. సినిమా కథ కూడా నటీనటులు, నృత్య తారల నేపథ్యంలో అల్లుకున్నదే కావడం విశేషం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.