* స్పైడర్‌మ్యాన్‌ సృష్టికర్తలకు నివాళి

సాలీడు లక్షణాలతో చకచకా భవనాల మధ్య నుంచి ఎగిరిపోతూ సందడి చేసే స్పైడర్‌మ్యాన్‌ అభిమానులు ప్రపంచమంతా ఉన్నారు. దశాబ్దాల తరబడి తరతరాలను అలరిస్తున్న ఈ స్పైడర్‌మ్యాన్‌ను సృష్టించిన ఘనత రచయిత స్టాన్‌లీ, చిత్రకారుడు స్టీవ్‌ డిట్కోలకే దక్కుతుంది. వీళ్లిద్దరూ కలిసి 1962లో ఈ పాత్రకు కామిక్‌ పుస్తకాల్లో తొలిసారిగా రూపం కలిపించి జీవం పోశారు. ఆ స్పైడర్‌మ్యాన్‌ పుస్తకాలు, టీవీలు, సినిమాల ద్వారా విజృంభించి ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 25.6 బిలియన్‌ డాలర్ల వ్యాపారం చేశాడు. అలాంటి స్పైడర్‌మ్యాన్‌ సృష్టికర్తలిద్దరూ 2018లోనే మరణించారు. వీరికి నివాళిగా మార్వెల్‌ కామిక్‌ సంస్థ కంప్యూటర్‌ యానిమేషన్‌ విధానంలో ఓ సినిమాను రూపొందించింది. అదే ‘స్పైడర్‌మ్యాన్‌: ఇన్‌టు ద స్పైడర్‌ వెర్స్‌’. ఈ సినిమా రూపకల్పనలో 140 మంది యానిమేటర్లు శ్రమించారు. దీన్ని 2018 డిసెంబర్‌ 1న విడుదల చేశారు. సుమారు 90 మిలియన్‌ డాలర్ల వ్యయంతో రూపొందించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 375.5 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రంగా ఆస్కార్‌ అవార్డు, యానీ అవార్డులు, గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు పొందింది. కొత్తగా స్పైడర్‌మ్యాన్‌గా మారిన ఓ హైస్కూలు కుర్రాడు, పాత స్పైడర్‌మ్యాన్‌ దగ్గర శిక్షణ పొంది ఎలాంటి సాహసాలు చేశాడనేదే కథ.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.