స్టార్‌వార్స్‌ సందడి
స్టార్‌వార్స్‌ అనగానే ఒరిజినల్స్, సీక్వెల్స్, ప్రీక్వెల్స్‌తో కలిపి తొమ్మిది సినిమాలు గుర్తొస్తాయి. అన్నీ సినిమాకొచ్చిన ప్రేక్షకుల్ని అట్నుంచి అటే అంతరిక్షంలోకి తీసుకుపోయి... గ్రహాంతర వాసుల్ని, కొత్త సామ్రాజ్యాల్ని, వింత ఆకారాల్ని, విచిత్ర ఆయుధాల్ని చూపించి తీసుకొచ్చినవే. ప్రేక్షకులు కూడా ఆ అంతరిక్ష కథలకు మైమరచిపోయి పాప్‌కార్న్‌ తింటూ ఆనందించి కాసుల వర్షం కురిపించారు. ఈ సినిమాల పరంపరలో వచ్చిన స్టార్‌వార్స్‌ ప్రీక్వెల్‌ ట్రిలజీల్లో మొదటిది ‘స్టార్‌వార్స్‌: ఎపిసోడ్‌1- ద ఫాంటమ్‌ మినేస్‌’ 1999లో విడుదలై యధావిధిగానే అలరించింది. ప్రముఖ దర్శక నిర్మాత జార్జి లూకాస్‌ రచించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా, 115 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఏకంగా 1.027 బిలియన్‌ డాలర్ల పంట పండించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.