స్టార్‌వార్స్‌ సందడి

పెట్టుబడి 113 మిలియన్‌ డాలర్లు...వసూళ్లు 848.8 మిలియన్‌ డాలర్లు! ఈ సంచలనం ‘స్టార్‌వార్స్‌: ఎపిసోడ్‌3- రివెంజ్‌ ఆఫ్‌ ద సీత్‌’ (2005) సినిమాది. ‘స్టార్‌వార్స్‌’ సినిమాలంటేనే అంత. ప్రముఖ దర్శకనిర్మాత జార్జిలూకాస్‌ రాసి, తీసిన ఈ సినిమాలన్నీ కాసుల వర్షం కురిపించినవే. వీటి సందడి ఎప్పుడో 1977లో తొలి సినిమాతోనే మొదలైంది. నిజానికి అది తొలి సినిమానే కానీ, ఆ తర్వాత దానికి మూడు ప్రీక్వెల్స్‌ తీయడంతో మొదటి దాని పేరు ‘ఎపిసోడ్‌ 4-ఎ న్యూ హోప్‌’గా మారింది. దీని తర్వాత మరో మూడు సీక్వెల్స్‌ వచ్చాయి. ఆపై మరో మూడు భాగాలు కూడా వచ్చాయి. మరో భాగమైన ‘ఎపిసోడ్‌ 9-ద రైజ్‌ ఆఫ్‌ ద స్కైవాకర్‌) 2019లో రాబోతోంది. ఏ భాగమైనా, ఈ సినిమాల కథలన్నీ అంతరిక్ష ప్రయాణాలు, అత్యాధునిక ఆయుధాలు, గ్రహాంతర వాసులు, వాళ్లతో యుద్ధాలు, రోదసిలో సామ్రాజ్యాలు... ఇలా సకల హంగామాతో సాగిపోతాయి. ఇవన్నీ విజయవంతమై గిన్నిస్‌ రికార్డును కూడా సాధించాయి. మొత్తం మీద ఇవన్నీ కలిసి 65 బిలియన్‌ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాయి. ‘రివెంజ్‌ ఆఫ్‌ సీత్‌’ సినిమా 2005 మే 15న కేన్స్‌ చిత్రోత్సవంలో ప్రీమియర్‌ షోగా ప్రదర్శితమై, మే 19న విడుదలైంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.