రాబిన్‌హుడ్‌ సాహసాలు
అన్నను కారాగారంలో బంధించి, తమ్ముడు సింహాసనం అధిష్టించడం... ప్రజలపై పన్నులు పెంచేసి పీడించి అరాచకం సృష్టించడం... ఆ ప్రజల లోంచి ఓ నాయకుడు ఈ అన్యాయాలను ఎదిరించడం... ధనికులను దోచుకుని పేదలకు పంచుతూ ప్రజల మద్దతు కూడగట్టుకోవడం, తమ్ముడి పీచమణిచి అసలు రాజును సింహాసనంపై కూర్చోబెట్టడం... మధ్యలో రాకుమారితో ప్రేమ కథ...

ఈ వివరాలన్నీ వింటే ఒకటి కాదు, రెండు కాదు... ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు కళ్ల ముందు సినిమారీలులాగా తిరగుతాయి. ఇంచుమించు ఇదే కథతో ‘ద అడ్వెంచర్స్‌ ఆఫ్‌ రాబిన్‌హుడ్‌’ సినిమా 1938లోనే హాలీవుడ్‌లో తెరకెక్కింది. వార్నర్‌ బ్రదర్స్‌ సంస్థ టెక్నికలర్‌లో మైకేల్‌ కర్టిజ్‌ దర్శకత్వంలో రాబిన్‌హుడ్‌గా ఎరోల్‌ ఫ్లిన్, అతడి మనసు దోచిన రాచకన్యగా అందాల తార ఒలివియా డీ హవిలాండ్‌ నటించిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. మూడు ఆస్కార్‌ అవార్డులు గెలుచుకోవడంతో పాటు, రెండు మిలియన్ల వ్యయానికి రెట్టింపు లాభాలు వసూలు చేసి కాసుల వర్షం కురిపించింది.

                                         


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.