మాయలు నేర్చిన కుర్రాడు,


మాయలు, మంత్రాలు నేర్చిన కుర్రాడి కథగా ‘హ్యారీపాటర్‌’ సినిమాలకు ప్రపంచ దేశాల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఈ చిత్రాల పరంపరలో ఆఖరుది, ఎనిమిదోది అయిన ‘హ్యారీపాటర్‌ అండ్‌ ద డెడ్లీ హాలోస్‌’ సినిమా 2011లో జులై 7న విడుదలైంది. బ్రిటిష్‌ రచయిత్రి జె.కె. రౌలింగ్‌ ఇదే పేరుతో రాసిన నవల ఆధారంగా తీసిన ఇది హ్యారీపాటర్‌ సినిమాల్లో త్రీడీ వెర్షన్‌లో విడుదలైన ఏకైక సినిమా. తాజా లెక్కల ప్రకారం చూస్తే ఇంతవరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో పదవది. హ్యారీపాటర్‌ సినిమాల్లో అత్యధికంగా రాబట్టింది. 250 మిలియన్‌ డాలర్లతో తీసిన ఇది 1.342 బిలియన్‌ డాలర్లు వసూలు చేసింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.