ఒక రోగి ప్రేమకథ!

యుద్ధరంగంలో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన పేరును కూడా మర్చిపోయాడు. ఓ నర్స్‌ అతడిని వైద్య శిబిరానికి తీసుకొచ్చి చికిత్స అందించడం మొదలుపెడుతుంది. అతడికి నెమ్మదిగా గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ వివరాలన్నీ ఫ్లాష్‌బ్యాక్‌లో నర్స్‌కి చెబుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఆ రోగి, ఆ నర్స్‌ కూడా ప్రేమలో పడతారు. రాజకీయాలు, మానవీయ కోణాలు, ప్రణయ ఘట్టాలు... ఇలాంటి సన్నివేశాలతో సాగే ‘ద ఇంగ్లిష్‌ పేషెంట్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, 9 ఆస్కార్‌ అవార్డులను, 5 బాఫ్తా అవార్డులను, 2 గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులను అందుకుంది. 20వ శతాబ్దంలో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటిగా పేరొందడంతో పాటు, సుమారు 30 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి 232 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఇటాలియన్‌ మానెస్టరీలో చేరిన ఇంగ్లిషు పేషెంట్‌ కథగా వచ్చిన నవలకు తెరరూపంగా ఈ సినిమా. చిత్రానికి ఆంటోనీ మింగెల్లా దర్శకత్వం వహించాడు. నవంబర్‌ 6న యుఎస్‌ఏలోని లాస్‌ఏంజెల్స్, కాలిఫోర్నియాలో ప్రిమియర్‌ షో వేశారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.