సినీ చరిత్రలో ఓ మలుపు

చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ చరిత్రనే మలుపు తిప్పిన సినిమాలుగా కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే ‘ద ప్యాషన్‌ ఆఫ్‌ జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’ (1928). ఫ్రెంచి చరిత్రకు అద్దం పడుతూ వచ్చిన ఈ మూకీ చిత్రాన్ని ఇప్పటికీ ఓ ‘ల్యాండ్‌మార్క్‌’ చిత్రంగా పేర్కొంటారు. ప్రముఖ దర్శకుడు కార్ల్‌ థియోడర్‌ డ్రేయర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కీలకమైన జోన్‌ పాత్రలో ఫాల్కొనెట్టి నటించింది. ఈమె నటనను, దర్శకత్వ విలువలను, చిత్రీకరణ తీరును సినీ ఔత్సాహికులు ఈనాటికీ ప్రమాణంగా తీసుకోవడం విశేషం. బ్రిటిష్‌వారి పాలనలో ఫ్రాన్స్‌ ఉన్న కాలానికి సంబంధించిన చారిత్రక అంశాలను స్పృశిస్తూ సినిమా సాగుతుంది. ఫ్రాన్స్‌ నుంచి బ్రిటిషర్లను తరిమికొట్టడానికి దేవుడు ఆదేశం మేరకు పోరాడిన మహిళగా జోన్‌ను పేర్కొనేవారు. ఆమెను దేవదూతగా, యోధురాలిగా ప్రజలందరూ విశ్వసించేవారు. కానీ సైనికాధికారులు మాత్రం ఆమె చేత నిజం చెప్పించడానికి చిత్రహింసలు పెట్టడం, చివరకు సజీవంగా దహనం చేయడం లాంటి సంఘటనల నేపథ్యంలో సినిమాను తీశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.