వలస రైతుల కథ

రైతుల సమస్యలు ఎక్కడైనా ఒకటే. అలా కరువు నేపథ్యంలో ఉన్న ఫార్మ్‌ల్యాండ్‌ను బ్యాంకులు జప్తు చేస్తే పిల్లాపాపలతో కొత్త జీవితం కోసం కాలిఫోర్నియా బయల్దేరిన ఓ అమెరికా రైతు కుటుంబం కథతో తెరకెక్కిన ‘ద గ్రేప్స్‌ ఆఫ్‌ ర్యాత్‌’ సినిమా ప్రపంచ సినీ చరిత్రలో ఓ గొప్ప సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. జాన్‌ స్టీన్‌బెక్‌ అనే రచయిత 1939లో రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ఆ నవలకు ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్‌ పురస్కారం లభించింది. ఎనిమిది లక్షల డాలర్లతో తీసిన ఈ సినిమా మూడు రెట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమాను నేషనల్‌ ఫిలిం లైబ్రరీలో భద్రపరిచారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.