దర్శకురాలి ఘనత!

ఆస్కార్‌ చరిత్రలో తొలిసారి ఓ దర్శకురాలు తీసిన సినిమా ఉత్తమ చిత్రంగా నిలిచింది... అలాగే తొలిసారిగా ఓ దర్శకురాలు ఉత్తమ దర్శకురాలి అవార్డు గెలిచింది...ఆ సినిమా ‘ద హర్ట్‌ లాకర్‌’ అయితే, ఆ దర్శకురాలు కత్రిన్‌ బిగెలో. అమెరికన్‌ వార్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్‌ ప్రదర్శన 2008 సెప్టెంబర్‌ 3న వెనీస్‌ చిత్రోత్సవంలో జరిగింది. ఈ సినిమా తొమ్మిది ఆసా ్కర్‌లకు నామినేషన్‌ పొంది, ఆరు ఆస్కార్‌లను గెలుచుకోవడం విశేషం. యుద్ధం నేపథ్యంలో, వాస్తవికమైన చిత్రీకరణతో, మానవ సంబంధాలను, భావోద్వేగాలను చక్కగా రూపొందించిన చిత్రంగా ఇది విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. కత్రిన్‌ బిగెలో ఈ సినిమాకు నిర్మాత కూడా కావడం విశేషం. అయితే జర్నలిస్ట్‌ అయిన మార్క్‌బోల్‌ దీనికి స్కీన్ర్‌ప్లే రాయడం మరో విశేషం. దర్శకురాలు కత్రిన్‌ బిగెలో ప్రఖ్యాత దర్శకనిర్మాత జేమ్స్‌ కామెరాన్‌ మాజీ భార్య. అయితే అతడే ఆమెను ఈ సినిమా తీయమని ప్రోత్సహించడం ఆసక్తికరం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆస్కార్‌ అవార్డులలో ఈ సినిమా కామెరాన్‌ తీసిన ‘అవతార్‌’ సినిమాతో పోటీ పడి మరీ ఆరు అవార్డులు అందుకుందిCopyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.