థ్రిల్లర్‌ సినిమాలకు నాంది..

ఓ నిశ్శబ్ద చిత్రం... కానీ నిశ్శబ్దంగానే ఓ వినూత్నమైన ఒరవడికి నాంది పలికింది. ఇప్పుడు అందరూ గొప్పగా చెప్పుకునే థ్రిల్లర్‌ సినిమాలనే ఓ ప్రత్యేకమైన జోనర్‌కి శ్రీకారం చుట్టింది. అదే ‘ద లాడ్జర్‌: ఎ స్టోరీ ఆఫ్‌ ద లండన్‌ ఫాగ్‌’. దీన్ని తీసింది ఎవరో తెలుసా? ‘మాస్టర్‌ ఆఫ్‌ సస్పెన్స్‌’గా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన దిగ్దర్శకుడు ‘ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌’. ఆయన తీసిన ఈ సినిమా ఇదే రోజు విడుదలై ప్రపంచ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రతి మంగళవారం రాగి రంగు జుట్టుతో అందంగా ఉండే అమ్మాయిలను చంపే ఓ సీరియల్‌ కిల్లర్‌ కథతో తీసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.