రాకాసి బల్లుల హంగామా

ఓ రచయిత రాస్తున్న నవల హక్కుల్ని అది విడుదల కాకుండానే కొనేశారు. ఆ నవల ఆధారంగా సినిమాలు తీసి విజయాలు సాధించారు. ఎందుకంటే ఆ రచయిత అలాంటిలాంటివాడు కాదు. అతడి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ఆ రచయిత మైకేల్‌ క్రిచ్‌టన్‌ అయితే, ఆ నవల ‘జురాసిక్‌ పార్క్‌’. ఆ నవల సంచలనం సృష్టిస్తుందని ముందే ఊహించి దాని హక్కులు కొనేసింది ఎవరో కాదు... ప్రపంచ ప్రఖ్యాత దర్శకనిర్మాత స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌. అనుకున్నట్టుగానే ఆ నవల, ఆ సినిమాలు కూడా సూపర్‌హిట్టయ్యాయి. ఆ సినిమాల పరంపరలో వచ్చిన ‘ద లాస్ట్‌ వరల్డ్‌: జురాసిక్‌ పార్క్‌’, 1997లో విడుదలై సంచలనం సృష్టించింది. ఇది అంతకుముందు వచ్చిన ‘జురాసిక్‌ పార్క్‌’ (1993) సినిమాకు సీక్వెల్‌. దీన్ని 73 మిలియన్‌ డాలర్ల వ్యయంతో తీస్తే ప్రపంచవ్యాప్తంగా 618.6 మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.