మరోసారి విజృంభించిన స్పైడర్‌మ్యాన్‌

సాలీడులాగా గోడలను నిట్ట్ట్లనిలువుగా ఎక్కడమే కాదు, సాలె దారాల ఆధారంతో గాలిలోకి చకచకా ఎగురగలిగే స్పైడర్‌మ్యాన్‌ తరతరాలుగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. మార్వెల్‌ కామిక్‌ పుస్తకాల్లో సూపర్‌హీరో పాత్రగా 1962లో పుట్టిన స్పైడర్‌మ్యాన్‌ టీవీల్లోను, సినిమాల్లోనూ సందడి చేస్తూనే ఉన్నాడు. ఆ పాత్రలో వచ్చిన మరో సినిమా ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌2’ (2014). ఇది స్పైడర్‌ మ్యాన్‌ పాత్రతో వచ్చిన సినిమాల్లో అయిదవది. అంతక్రితం వచ్చిన ‘ద ఎమేజింగ్‌ స్పైడర్‌మ్యాన్‌’ (2012) సినిమాకి సీక్వెల్‌. ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో తెరకెక్కించిన ఈ సినిమా 293 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ఏకంగా 709 మిలియన్‌ డాలర్లు రాబట్టి విజయం సాధించింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.