పిల్లీ ఎలకా పుట్టాయ్‌... ప్రపంచాన్ని ఏలాయ్‌!

వ్వించే తెలివైన ఎలక... దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యే పిల్లి... ఈ రెండూ కలిసి ప్రపంచ వినోద రంగంలో సంచలనం సృష్టించాయి. దేశదేశాల్లో తరతరాలుగా పిల్లల్నీ, పెద్దల్నీ ఆకట్టుకుని నవ్వులు పంచాయి. ఆ పిల్లి టామ్‌ అయితే, ఆ ఎలుక జెర్రీ. ఇవి రెండూ ‘టామ్‌ అండ్‌ జెర్రీ’గా కార్టూన్‌ సినిమాలు, టీవీ సీరియల్స్, వెండితెర సినిమాలుగా కోట్లాది మందిని అలరించాయి. వీటికి విలియం హన్నా, జోసెఫ్‌ బార్బెరా అనే ఇద్దరు కలిసి 1940 ఫిబ్రవరి 10న ప్రాణం పోశారు. మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ (ఎంజీఎం) సంస్థతో కలిసి వీరు 1940 నుంచి 1958 వరకు తీసిన 114 లఘుచిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంతో పాటు ఏడు ఆస్కార్లు గెల్చుకున్నాయి. ఆ తర్వాత కూడా వీటి హవా కొనసాగింది. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌గా ఇవి రికార్డు సృష్టించాయి. మొత్తం మీద ఇవి రెండూ కలిసి మొత్తం 164 షార్ట్స్‌ ద్వారా అలరించాయి. టెలివిజన్‌ సీరియల్స్‌గా కూడా ఇంటింటికీ వినోదాన్ని పంచాయి. తర్వాత ఇవి తొలిసారిగా 1992లో ‘టామ్‌ అండ్‌ జెర్రీ: ద మూవీ’ ఫీచర్‌ మూవీగా వెండితెరపై వెలిగాయి. ఆపై 2002 నుంచి మరో 13 డైరెక్ట్‌ వీడియో సినిమాలుగా విడుదలయ్యాయి.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.