మహిళా దర్శకురాలి జయకేతనం!

ప్పటిదాకా సూపర్‌మ్యాన్‌ మాత్రమే ప్రేక్షకులకు తెలుసు. ఏం, అలాంటి శక్తులు ఓ మహిళకు ఉండకూడదా? ఆ మహిళ తన అపూర్వ శక్తులతో దుష్టులను దునుమాడకూడదా? ఈ ఆలోచనను వెండితెరపైకి తర్జుమా చేసిన సినిమా ‘వండర్‌ ఉమన్‌’ (2017). దీనికి ఓ మహిళ దర్శకత్వం వహించడం విశేషం.అందుకే ఇది తొలిసారిగా ఒక మహిళ దర్శకత్వం వహించిన సూపర్‌హీరో చిత్రంగా గుర్తింపు పొందింది. దీనికి ప్యాటీ జెన్‌కిన్స్‌ దర్శకత్వం వహించారు. అందాల తార గాల్‌గాడట్‌ నటించిన ఈ సినిమా 150 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి ప్రపంచవ్యాప్తంగా 821 మిలియన్‌ డాలర్లు వసూలు చేసింది. దీనికి సీక్వెల్‌గా ‘వండర్‌ ఉమన్‌ 1984’ సినిమాను 2020 జూన్‌ 5న విడుదల చేయనున్నారు. అమెజాన్‌ దీవిలో ఓ యోధురాలిగా ఎదిగిన యువరాణికి కూలిపోయిన విమానంలోని పైలట్‌ ద్వారా తన జన్మ రహస్యం తెలుస్తుంది. ఆమె తన శక్తులేంటో తెలుసుకుని ప్రపంచానికి ఎదురైన ముప్పును నివారించడమే కథ. 



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.