ఒకే ఒక్క నవల...సూపర్‌హిట్‌ సినిమా!

 రచయిత్రి ఒకే ఒక నవల రాసింది. ఆ నవల ఆధారంగా ఓ సినిమా తీస్తే అది సూపర్‌హిట్‌ సినిమా అయింది. ఆ రచయిత్రి ఎమిలీ బ్రోటే అయితే, ఆ సినిమా ‘ఉదరింగ్‌ హైట్స్‌’. ఆ నవలలో 34 ఛాప్టర్లు ఉంటే, మొదటి 16 ఛాప్టర్ల ఆధరంగానే ఈ సినిమాను తీశారు. ఓ పెద్ద బంగ్లాలో దెయ్యాలు, వాటి వెనుక ఫ్లాష్‌బ్యాక్‌లో ఓ అందమైన ప్రేమ కథ... ఇలాంటి కథలతో అనేక సినిమాలు వచ్చాయి. అలాంటి వాటికి నాంది పలికిన సినిమాగా దీన్ని చెప్పుకోవచ్చు. ప్రముఖ దర్శకుడు విలియం వైలర్‌ తీసిన ఈ సినిమా 8 ఆస్కార్‌ నామినేషన్లు పొంది సినిమాటోగ్రఫీకి అవార్డు గెల్చుకుంది. ఓ తుపాను రాత్రి అడవిలో దారి తప్పిపోయి ఓ పాడుబడిన బంగ్లాకి చేరిన ఓ వ్యక్తికి అందులో కలిగిన అనుభవాలుగా కథ సాగుతుంది. ఆ బంగ్లాలో ఉండే ఓ పనిమనిషి అతడికి అక్కడ కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన కథ చెబుతుంది. అది సామాజిక, ఆర్థిక అంతరాల వల్ల ప్రేమ విఫలమైన ఓ జంట కథ. ఈ సినిమా అమెరికాలో వంద మేటి సినిమాల జాబితాలో చోటు చేసుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.