ముగ్గురి ముచ్చట

సినిమా వచ్చిన కొత్తల్లో బలమైన మాధ్యమంగా మారి అనేక ప్రయోగాలకు తావిచ్చింది. ముఖ్యంగా హాస్యం విపరీతంగా ఆకట్టుకుంది. చార్లీ చాప్లిన్, లారెల్‌ అండ్‌ హార్డీ లాంటి ఎందరో వెండితెరపై నవ్వులు పంచారు. అలా కొన్ని సినిమాల్లో ముగ్గురు హాస్యనటులు బాగా అలరించారు. వారిని ‘త్రీ స్టూజెస్‌’ అనేవారు. వీళ్లు 1922 నుంచి 1970 వరకు 190 షార్ట్‌ ఫిలింస్‌లో నటించారు. మో హోవర్డ్, లారీ ఫైన్, కర్లీ హోవర్డ్‌ అనే వీళ్లు ముగ్గురూ నటించిన 44న సినిమా ‘యు నాజ్టీ స్పై’ 1940లో ఇదే రోజు విడుదలై ప్రపంచ వ్యాప్తంగా నవ్వులు పూయించింది. దీనికి జూల్స్‌ వైట్‌ దర్శకత్వం వహించాడు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.