ప్ర‌చారం మాత్ర‌మే.. పోటీ చేయ‌డం లేదు!
మొత్తానికి అటు తిరిగి ఇటు తిరిగి అలీ వైకాపాలో చేరాడు. గుంటూరు సీటు కావాలి - మంత్రి ప‌ద‌వి కావాలి - అనే ష‌ర‌తుల్ని కూడా ప‌క్క‌న పెట్టేశాడు. 'జ‌గ‌న్ రావాలి.. జ‌గ‌న్ కావాలి అని ప్ర‌జ‌లు అంటున్నార‌. నేనూ నా వంతు తోడ్పాటు అందివ్వ‌డానికే ఈ పార్టీలో చేరాను. ఈసారికి పోటీ చేయ‌డం లేదు. కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మే చేస్తా. జ‌గ‌న్‌ని ముఖ్య‌మంత్రిగా గెలిపించుకుంటా' అంటున్నాడు అలీ.


మ‌రి టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను ఎందుకు క‌లిశారు? అక్క‌డ మీ ష‌ర‌తుల్ని ఒప్పుకోలేదా? అని అడిగితే.. 'నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెప్ప‌డానికే వాళ్ల‌ని క‌లిశా ' అంటూ క‌వ‌రింగు చేసేసుకున్నాడు. గుంటూరు సీటుకు మాత్రం అటు టీడీపీ, ఇటు వైకాపా `నో` చెప్పిన‌ట్టు ఒప్పుకున్నాడు. స్థానికుల‌కు టికెట్లు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు అన్నార‌ని, త‌న పాద యాత్ర‌లో కొంత‌మందికి మాటిచ్చాన‌ని జ‌గ‌న్ చెప్పార‌ని, అందుకే ఈసారి పోటీ చేయ‌డం లేద‌న్నారు. అయితే రాజ‌మండ్రి, విజ‌య‌వాడ నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తారా? అని అడిగితే.. 'త‌ప్ప‌కుండా' అని స‌మాధానం చెప్పాడు అలీ. మొత్తానికి అలీ ఇప్పుడు ప్ర‌చారానికి ప‌రిమిత‌మ‌న్న‌మాట‌.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.