అలా ‘యమలీల’తో హీరోగా మారా!

అలీ.. సొట్ట బుగ్గలతో దర్శనమిస్తూనే నవ్విస్తారు. పొట్ట చెక్కలయ్యేలా కామెడీ పండిస్తారు. బాల నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై స్టార్‌ కమెడియన్‌, హీరో, వ్యాఖ్యాతగా ఒక్కో మెట్టు ఎక్కారు. ప్రతి విభాగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇటీవలే ఈటీవీలో ప్రసారమయ్యే ‘మనసు పలికే’ కార్యక్రమంలో పాల్గొన్ని కొన్ని విషయాలు పంచుకున్నారు అలీ . నట ప్రయాణం ఎలా మొదలైంది? హీరోగా ఎలా మారారు? ఎదుర్కొన్న సవాళ్లు తదితర వాటి గురించి తెలిపారు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ ‘యమలీల’లో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నట్లు ఆయనకు కూడా తెలీదట. ‘‘ఓ రోజు దర్శకుడు ఆఫీసుకు రమ్మని చెప్పి.. ఒప్పంద పత్రం నా ముందు పెట్టారు. నేను ఏదో సినిమాలే అని సంతకం చేసేశా. మూడు పేజీలు చూసిన తర్వాత హీరోగా సంతకం చేయించుకున్నారని తెలిసింది. నేను హీరో ఏంటి సర్‌? అని అడిగా.. అలా జరిగిపోయింది. అలా ‘యమలీల’లో హీరోగా నటించా’ అని చెప్పుకొచ్చారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.