లఘుచిత్ర దర్శకుడితో ఆనంద్‌ దేవరకొండ

‘దొరసాని’ చిత్రంతో వెండి తెరకు పరిచమయ్యాడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ హీరో రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కించాడు. ప్రస్తుతం తన రెండో సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇది సెట్స్‌పై ఉండగానే మరో చిత్రం ఓకే చేశాడు. పలు లఘుచిత్రాలను తీసిన దామోదర అట్టాడ ఆనంద్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను టాంగా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ మట్టపల్లి, ప్రదీప్‌ ఎర్రబెల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ముగ్గురు కొత్త సంగీత దర్శకులు టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్నారు. ఇద్దరు కథానాయికల్ని ఎంపిక చేశారట. త్వరలోనే వాళ్లెవరో తెలియనుంది. నవంబరు నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.