బుమ్రా స్నేహితుడు మాత్రమే

స్టార్ క్రికెట‌ర్ జ‌స్‌ప్రీత్ సింగ్ బుమ్రా టాలీవుడ్‌కి చెందిన ఓ క‌థానాయిక‌తో ప్రేమాయ‌ణం సాగిస్తున్నాడ‌న్న మాట ఎప్ప‌ట్నుంచో వినిపిస్తోంది. అగ్ర క‌థానాయిక రాశిఖ‌న్నానే ఆ క‌థానాయిక అంటూ ఇదివ‌ర‌కు పెద్ద‌యెత్తున ప్ర‌చారం సాగింది. దీనిపై రాశిఖ‌న్నా స్పందిస్తూ అస‌లు బుమ్రాని తానెప్పుడూ క‌ల‌వ‌లేద‌ని, ఆయ‌న క్రికెట‌ర్ అన్న విష‌యం త‌ప్ప నాకు మ‌రేమీ తెలియ‌ద‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. దాంతో ఆ ప్ర‌చారానికి అప్ప‌టితో పుల్‌స్టాప్ ప‌డింది. తాజాగా మ‌రో క‌థానాయిక పేరు తెరపైకొచ్చింది. ఆమె ఎవ‌రో కాదు.. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. బుమ్రాకీ, అనుప‌మ‌కీ మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌నే గుస‌గుస‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. తాజాగా ఆ విష‌యంపై అనుప‌మ కూడా స్పందించింది. ``బుమ్రా నాకు మంచి స్నేహితుడు. అంతే త‌ప్ప జ‌రుగుతున్న ప్ర‌చారంలో మాత్రం ఎలాంటి నిజం లేద``ని ఆమె ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్టం చేసింది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.