అనుపమ తొలి సాహసం

పేరుకు మలయాళ కుట్టినే అయినా.. తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే ఇక్కడి ప్రేక్షకులకు చేరువైపోయింది అనుపమ పరమేశ్వరన్‌. తొలి చిత్రంతోనే తేనె లొలుకు తెలుగు భాషలో సంభాషణలు చెప్పుకోని తాను పరాయి పిల్లను కాదని చెప్పేసింది. ఇక ఈ నాలుగేళ్ల సినీ కెరీర్‌లో దక్షిణాదిలోని అన్ని భాషల్లోనూ నటించేసి సినీ ప్రియుల్ని మురిపించింది ఈ చిన్నది. ఇప్పుడీ భామ తొలిసారి ఓ నాయికా ప్రాధాన్య చిత్రం చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. గతేడాది ‘రాక్షసుడు’తో విజయాన్ని అందుకున్నాక తెలుగులో మరే చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు అనుపమ. కానీ, తాజాగా హనుమాన్‌ అనే యువ దర్శకుడు చెప్పిన ఓ కథ ఆమెను విపరీతంగా ఆకర్షించిందని తెలుస్తోంది. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథతో దీన్ని రూపొందించబోతున్నట్లు సమాచారం. దీన్ని పివిపి పతాకంపై నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పూర్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ద్వితియార్థంలోనే ఇది సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.