నాకు బాగా నచ్చేది అదే!

తెలుగులో చిత్రీకరణలు లేనప్పుడు ఇక్కడవారి రుచుల్లో బాగా మిస్‌ అవుతున్న వంటకాలేమైనా ఉన్నాయా?అని అనుపమ పరమేశ్వరన్‌ అడగ్గా అందుకు సమాధానం చెబుతూ..‘‘నాకిక్కడి రుచుల్లో బాగా నచ్చేది హైదరాబాద్‌ బిర్యానీ. అదంటే చచ్చేంత పిచ్చి. ఇక్కడ నేను ప్రత్యేకంగా మెచ్చే భోజనమంటే.. అన్నం, పప్పు, పెరుగు కాంబినేషనే. వీటికి తోడు అందులోకి చికెన్‌ వచ్చి చేరిందంటే నాకది పర్‌ఫెక్ట్‌ మీల్‌. రోజూ ఈ నాలుగు రకాలతోనే భోజనం పెట్టినా విసుక్కోకుండా లాగించెయ్యగలను. కరోనా వల్ల ఈసారే ఈ వంటకాలన్నీ రుచి చూడలేకపోతున్నా. ‘అఆ’ చిత్రంతో తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఏడాదీ తెలుగు నేలపై అడుగుపెట్టకుండా, ఇక్కడి సెట్లో భోజనం చెయ్యకుండా లేనని’’చెప్పింది.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.