మరో సురవరం వస్తాడట..

నేక అడ్డంకులను దాటుకోని ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అర్జున్‌ సురవరం’ ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద జోరు చూపిస్తోంది. నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్‌ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించింది. మీడియా శక్తిని సరికొత్త కోణంలో పరిచయం చేస్తూ ఓ విభిన్నమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం సక్సెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ ‘అర్జున్‌ సురవరం’కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘‘దాదాపు ఏడాదిన్నర కష్టాలు, ఎదురుచూపులకు తగ్గ ఫలితం దక్కింది. ఆలస్యంగా బయటకొచ్చినా అదిరిపోయే విజయాన్ని అందించింది. ఇప్పుడు దీనికొస్తున్న స్పందన చూసి చిత్ర నిర్మాతలు దీనికి కొనసాగింపు చిత్రం చేయాలని ఆలోచన చేస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ యువ హీరో మాటలు వింటే మరో అర్జున్‌ సురవరాన్ని చూడటం పక్కా అన్న సంకేతాలు అందుతున్నాయి. మరి ఇదెప్పుడు పట్టాలెక్కుతుంది? ఎప్పటికి ప్రేక్షకుల ముందుకొస్తుంది? అన్నవి తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.