బాలయ్యకు ప్రతినాయకుడుగా సంజయ్‌ దత్‌?
బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌ దత్‌ కనిపించబోతున్నాడా? ప్రస్తుతం ఇదే చిత్ర సీమలో హాట్‌ టాపిక్‌గా మారింది. అసలు విషయం ఏంటంటే? బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కనుందని తెలిసిన విషయమే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించే ఆ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇందులో బాలయ్యకు ప్రతినాయకుడి పాత్రకు సంజయ్‌ దత్‌ను అనుకుంటున్నారని వినిపిస్తోంది. ఈ మేరకు సంజయ్‌తో సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య, సంజయ్‌ కాంబినేషన్‌ అనగానే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఇదే నిజమైతే వాళ్లకు పండగే. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత రానుంది. ప్రస్తుతం బాలకృష్ణ ‘రూలర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తైన తర్వాత బోయపాటి దర్శకత్వంలో నటించనున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.