బాలకృష్ణతో పాయల్‌?

యువ కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌ బాలకృష్ణ సరసన నటించనుందని సమాచారం. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో నాయికగా పాయల్‌ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిత్ర బృందం పలువురు బాలీవుడ్‌ నాయికల్ని, సీనియర్‌ హీరోయిల్ని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అయితే వాళ్ల డేట్స్‌ ఖాళీగా లేకపోవడం, రెమ్యునరేషన్‌ ఎక్కువ ఉండటంతో పాయల్‌ని కలిశారని టాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం చర్చలు సాగతున్నాయని వినిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించబోయే నాయిక ఎవరో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్‌ జీవితాధారంగా క్రిష్‌ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో బాలయ్యతో కలిసి నటించింది పాయల్‌. దీంతో మరోసారి ఈ జోడీ కనువిందు చేస్తుందనడంతో ఆసక్తి పెరుగుతోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.