మరోసారి రామ్, సీత జోడి??

ప్రముఖ టాలీవుడ్‌  నటుడు రామ్‌ చరణ్, బాలీవుడ్‌ బ్యూటీ కియారా పెయిర్‌కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. గతేడాది ‘వినయ విధేయ రామ’ చిత్రంతో సందడి చేశారు ఈ ఇద్దరు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌గా చెర్రీ, సీతగా కియారా కనువిందు చేశారు. ఈ పాత్రలపై రూపొందించిన ‘రామా లవ్స్‌ సీత.. సీత లవ్స్‌ సీత’ అనే పాటకు విపరీతమైన ఆదరణ లభించింది. మళ్లీ ఇప్పుడు ఇదే జంట మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమైందని టాక్‌. చిరంజీవి కథానాయకుడుగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రంలో చెర్రీ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లో చెర్రీ సరసన కియారా కనిపిస్తుందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఇద్దరిపై ఓ పాట కూడా ఉండబోతుందట. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.