వీళ్లతో రీ ఎంట్రీ??

చలాకీతనంతో అందరి దృష్టిని ఆకర్షించిన నాయిక జెనీలియా. హా..హా.. హాసిని అంటూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. అయితే వివాహం అనంతరం ఈ భామ నటనకు దూరంగా ఉంది. రీ ఎంట్రీ ఇస్తుందని ఎప్పటి నుంచో వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె రీ ఎంట్రీకి సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. చిరంజీవి కథానాయకుడుగా ‘లూసీఫర్‌’ రీమేక్‌ తెరకెక్కనుంది. సుజిత్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇందులోని ముఖ్యమైన పాత్ర ఉందని, దానికోసం జెనీలియాను సంప్రందిస్తున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. మరోవైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఓ సినిమా ప్రకటించారు. ఈ కథను మలుపు తిప్పే కీలక పాత్ర కోసం కూడా జెనీలియాను ఎంపిక చేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ఏ చిత్రం ముందు పట్టాలెక్కుతుందో ఎవరితో జెనీలియా రీ ఎంట్రీ ఇస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’తో చిరు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తారక్‌ బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.