హరీష్‌ డైరెక్షన్‌లో ‘అంధాధున్‌’ రీమేక్‌?

మూ
డు కేటగిరీల్లో జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్‌ చిత్రం ‘అంధాధున్‌’. అందుకే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లోనూ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో నాని నటిస్తున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా నితిన్‌ నటిస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. శ్రేష్ఠ్‌ మీడియా, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మించబోతున్నాయట. ఇది ఇలా ఉంటే మరి చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరనే సందేహానికి హరీష్‌ శంకర్‌ పేరు వినబడుతోంది. ఇదే విషయమై నిర్మాతలు హరీష్‌ను సంప్రదించారని, ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయని టాలీవుడ్‌ టాక్‌. త్వరలోనే వివరాలు తెలియనున్నాయి. గతంలో హరీష్‌ బాలీవుడ్‌ చిత్రం ‘ద బాంగ్‌’ను తెలుగులో ‘గబ్బర్‌సింగ్‌’గా తెరకెక్కించి ఎంతటి ఘన విజయం సాధించాడో తెలిసిన విషయమే. ఆయన అయితేనే ఈ చిత్రానికి న్యాయం చేయగలడంటూ అందుకే ఆ ప్రాజెక్టు హరీష్‌ దగ్గరకు వెళ్లిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హరీష్‌ వరుణ్‌ తేజ్‌తో తీసిన ‘వాల్మీకి’ సెప్టెంబరు 20న విడుదలవుతోంది.ఆ చిత్రం రిలీజ్‌ తర్వాత ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.
సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.