బిజీగా గడిపితేనే సంతోషం!
అవకాశాల్ని ఒడిసి పట్టడంతో చురుగ్గా వ్యవహరించే కథానాయికలు చాలామందే. అయితే వాళ్లలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తీరే వేరు. ఆమె సినిమా తర్వాత సినిమా అనే ధోరణిలో కాకుండా... ఒకేసారి మూడు నాలుగు సినిమాలైనా ఓకే అంటుంది. అదెలా సాధ్యమని అడిగితే ‘అదే మరి... సినిమాపై నాకున్న తపన, ప్రేమ’ అని సమాధానమిస్తోంది. మొన్నటిదాకా తెలుగులో జోరు చూపించిన ఆమె, ఇప్పుడు తమిళం, హిందీ చిత్రాలపై దృష్టిపెట్టింది. అయితే త్వరలోనే హైదరాబాద్‌ తిరిగొస్తానంటోంది. త్వరలోనే ఆమె ‘ఎన్టీఆర్‌’ చిత్రం కోసం రంగంలోకి దిగబోతోందని సమాచారం. అందులో శ్రీదేవిగా నటించనుంది రకుల్‌. అయితే ఇకపైన రకుల్‌ ఆచితూచి అడుగులేయబోతోందట. చేతిలో ఉన్న సినిమాలయ్యాక విరామం తీసుకొని నాణ్యమైన కథల్ని ఎంపిక చేసుకొంటూ ప్రయాణం చేస్తానంటోంది. ‘‘ఎంత బిజీగా గడిపితే అంత సంతోషం నాకు. కాకపోతే మధ్యలో అప్పుడప్పుడు ఇంటికి వెళుతూ, ఇంటి వంటల రుచులు ఆస్వాదించాల్సిందే. లేదంటే బెంగ వచ్చేస్తుంద’’ని చెప్పింది రకుల్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.