రూ.20 కోట్లు ఇస్తాన‌న్నా సినిమా అమ్మ‌లేదు

పూరి - రామ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. ఈ సినిమాకి నిర్మాత కూడా పూరినే. అటు పూరి - ఇటు రామ్ ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ సినిమా ఇద్ద‌రికీ చాలా కీల‌కం. దానికి త‌గ్గ‌ట్టుగానే పూరి ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నాడు. అందుకే అభిషేక్ పిక్చ‌ర్స్ ఈ సినిమాకి రూ.20 కోట్ల అవుట్ రేట్‌కి అడిగినా.. అమ్మ‌డానికి రెడీ కాలేదు. టీజ‌ర్‌, ట్రైల‌ర్ వ‌చ్చాక ఈ సినిమాకి బ‌జ్ వ‌స్తుంద‌ని, అప్పుడు క‌నీసం పాతిక కోట్ల‌యినా వ‌స్తుంద‌ని పూరి భావిస్తున్నాడ‌ట‌. నిజానికి ఈ సినిమాకి ఈనెల‌లోనే విడుద‌ల చేద్దామ‌నుకున్నారు. కానీ నిధి అగ‌ర్వాల్ పాస్ పోర్ట్ పోవ‌డం వ‌ల్ల‌... షూటింగ్ ఆల‌స్య‌మైంది. ఈరోజుతో టాకీ మొత్తం పూర్త‌వుతుంది. నాలుగు పాట‌లు మిన‌హా సినిమా అయిపోయిన‌ట్టే. రెండు పాట‌ల్ని యూర‌ప్‌లోనే తీయాల‌ని పూరి డిసైడ్ అయ్యాడు. అందుకే సినిమా ఆల‌స్యం అవుతోంది. రంజాన్ సంద‌ర్భంగా ఈసినిమాని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం ఆలోచ‌న‌. కానీ ఇప్పుడు ఈ సినిమా జులైకి షిఫ్ట్ అయ్యింది. టీజ‌ర్ రావ‌డానికీ టైమ్ ప‌ట్టే అవ‌కాశాలున్నాయి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.