గ్లామర్‌ లోకంలో ఉన్నవాళ్లకు అది తప్పదు!
ఫ్యాషన్‌ గురించి కథానాయికలకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఫ్యాషన్‌ మంత్ర అంటే ఏమిటో, ఎలా ఉంటుందో వాళ్లని చూసే తెలుసుకోవాలి. పూజా హెగ్డే కూడా ఫ్యాషన్‌ ప్రియురాలే! ఆమె కట్టూ, బొట్టులో అదే కనిపిస్తుంటుంది. ‘‘ఫ్యాషన్‌ కూడా ఓ భాషే. మీరేంటి అనేది మీ ఫ్యాషన్‌ని బట్టి చెప్పొచ్చు. మాటలు అవసరం లేకుండా మనల్ని మరొకరికి పరిచయం చేసే సాధనం ఈ ఫ్యాషన్‌. మన ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ ప్రతిబింబిస్తుంటాయి’’ అంటోంది పూజా. ‘‘ట్రెండ్‌కి తగినట్టు మనల్ని మనం మార్చుకోవాలి. గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నవాళ్లకు అది తప్పనిసరి. మన శరీర తీరుకు ఏమాత్రం నప్పకపోయినా ఫ్యాషన్‌ వృథానే. బ్రాండ్‌ పేరుతో ఖరీదైన వస్త్రాలను కొనడంలో అర్థం లేదు. వచ్చిన ప్రతీ ఫ్యాషన్‌నీ అనుకరించాలని లేదు. ఏదైనా సరే మితిమీరి అనుసరించడం కూడా ప్రమాదమే’’ అంది పూజా.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.